Bharani Shankar: బిగ్ బాస్ కంటెస్టెంట్ భరణికి విషెస్ తెలిసిన నాగబాబు

Naga Babu wishes Bigg Boss contestant Bharani Shankar
  • బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన భరణి శంకర్
  • ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన నాగబాబు
  • భరణి శంకర్ మద్దతుగా సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు
ప్రముఖ నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబు తన సన్నిహితుడైన భరణి శంకర్‌ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొంటున్న సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

"నా ప్రియమైన భరణి శంకర్, బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెడుతున్నందుకు హార్దిక శుభాకాంక్షలు. ఈ ప్రయాణం ఆయనకు తగిన గుర్తింపు, విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను," అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

భరణి శంకర్‌ బిగ్ బాస్ 9 హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి రోజే ఆయనపై భారీగా దృష్టి పడింది. టీవీ ప్రేక్షకుల్లో ఆయనకు ఉన్న క్రేజ్‌తో పాటు, నాగబాబు వంటి ప్రముఖుల మద్దతు కూడా ఆయన గేమ్‌కు ఊతమివ్వనున్నట్లు భావిస్తున్నారు.

ఈ సందర్భంగా భరణికి మద్దతుగా అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్స్ సృష్టిస్తున్నారు. 
Bharani Shankar
Naga Babu
Bigg Boss Telugu Season 9
Bigg Boss 9
Telugu reality show
Konidela Naga Babu
Bharani Bigg Boss
Telugu TV show

More Telugu News