Nara Lokesh: కర్ణాటకలోని శ్రీ ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్.. ఫొటోలు ఇవిగో!

Nara Lokesh Visits Sri Adichunchanagiri Kshetra in Karnataka
  • పీఠాధిపతి నిర్మలానందనాథ మహాస్వామిజీతో లోకేశ్ ప్రత్యేక భేటీ
  • మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై ఆరా
  • పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించే సంవిత్ పాఠశాలల గురించి ఆసక్తి
  • ఏపీలోనూ సంవిత్ స్కూల్ ఏర్పాటు చేయాలని లోకేశ్ విజ్ఞప్తి
  • మంత్రి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి అంగీకరించిన పీఠాధిపతి
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని ప్రముఖ సామాజిక, ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని సందర్శించారు. 18 వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మఠం జ్ఞానానికి, భక్తికి, సేవకు చిహ్నం. ఈ సందర్భంగా క్షేత్రంలోని శ్రీ కాలభైరవేశ్వర స్వామివారిని దర్శించుకుని మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం చేపడుతున్న వివిధ సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆసక్తిగా పరిశీలించారు. 

ఈ సందర్భంగా, మఠం 72వ పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామిజీ ఆశీర్వాదం పొందారు. మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, మెడికల్ కాలేజ్, హాస్పిటల్, యూనివర్సిటీని మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. అనంతరం మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిత్ పాఠశాలల గురించి ప్రత్యేకంగా అడిగితెలుసుకున్నారు. 

పేద విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా 6వ తరగతి నుండి ఇంటర్ వరకూ అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తున్నాం అని మఠం నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఇంటర్ పూర్తయిన తరువాత ఏ రాష్ట్రంలో డిగ్రీ చదవాలి అనుకున్నా మఠం ఆర్ధిక సహాయం అందిస్తుంది అని తెలిపారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ లో పేద విద్యార్థులకు ఉపయోగపడేలా సంవిత్ పాఠశాల ప్రారంభించాలని మంత్రి నారా లోకేశ్ కోరగా పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామిజీ అందుకు అంగీకరించారు.
Nara Lokesh
Sri Adichunchanagiri
Karnataka temple visit
Nirmalanandanatha Swamiji
Samvit schools
Andhra Pradesh education
Mandya district
Kalabhairaveshwara Swamy
AP IT Minister
Education for poor students

More Telugu News