Hyderabad car accident: మద్యం మత్తులో పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన కారు
- ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం.. యువతి మృతి
- పోలీసులు సహా మరో ఇద్దరికి గాయాలు
- వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా ప్రమాదం
హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడుపుతూ ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. పోలీసులు సహా మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక నిమజ్జనం సందర్భంగా లంగర్‌హౌస్ దర్గా సమీపంలో పోలీసులు ట్రాఫిక్ విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ క్రమంలో వేగంగా దూసుకు వచ్చిన ఓ కారు పోలీసుల వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఆ కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఈ ప్రమాదంలో కశ్వి (20) అనే యువతి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనంలో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.