Pakistan Cricket: పాక్ క్రికెట్ స్టేడియంలో పేలుడు.. వీడియో ఇదిగో!

Pakistan Cricket Stadium Blast Kills One Injures Many
––
స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా బాంబు పేలుడు చోటుచేసుకుంది. దీంతో మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు ఒకరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లో జరిగిందీ దారుణం. పేలుడు ధాటికి మైదానంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంప్రూవైజ్డ్ పరికరాన్ని ఉపయోగించి దుండగులు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు చిన్నారులు గాయపడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Pakistan Cricket
Khyber Pakhtunkhwa
Pakistan stadium blast
Cricket stadium explosion
Khyber Pakhtunkhwa blast
Pakistan cricket match
Stadium bomb blast
Cricket match explosion

More Telugu News