Fatima Murad Sheikh: హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ.. మందుల మాటున రూ.12 వేల కోట్ల దందా!
- చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుర్తింపు
- అత్యవసర మందుల మాటున మెఫెడ్రోన్ ఉత్పత్తి చేస్తున్న ఫ్యాక్టరీ
- మహారాష్ట్ర పోలీసులు, ఎన్‌సీబీ అధికారుల సంయుక్త ఆపరేషన్
- బంగ్లాదేశ్ యువతి సహా మొత్తం 12 మంది నిందితుల అరెస్ట్
- మహారాష్ట్రలో చిన్న క్లూతో బయటపడిన దేశవ్యాప్త నెట్‌వర్క్
నగర శివారులోని చర్లపల్లి పారిశ్రామికవాడ కేంద్రంగా నడుస్తున్న వేల కోట్ల రూపాయల విలువైన భారీ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. అత్యవసర మందుల తయారీ ముసుగులో ప్రమాదకరమైన మెఫెడ్రోన్ (మ్యావ్ మ్యావ్) అనే మత్తుమందును రహస్యంగా ఉత్పత్తి చేస్తున్న ఓ ఫ్యాక్టరీపై మహారాష్ట్ర పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు సంయుక్తంగా దాడి చేసి ఒక బంగ్లాదేశ్ యువతి సహా మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు.
ఈ భారీ నెట్‌వర్క్‌కు సంబంధించిన మూలాలు మహారాష్ట్రలో బయటపడ్డాయి. గత నెల 8వ తేదీన కాశీమీరా ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బంగ్లాదేశ్‌కు చెందిన ఫాతిమా మురాద్ షేక్ అనే 23 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. ఆమె వద్ద నుంచి 105 గ్రాముల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫాతిమాను విచారించగా రెహ్మాన్ షేక్ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తేలింది.
అతడిని అరెస్ట్ చేయడంతో ఇది దేశవ్యాప్త నెట్‌వర్క్ అని గుర్తించిన మహారాష్ట్ర పోలీసులు 'డెకాయ్ ఆపరేషన్' ప్రారంభించారు. నిందితుల ముఠాలోనే తమ సిబ్బందిని ప్రవేశపెట్టి మహారాష్ట్ర వ్యాప్తంగా 60 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు కీలక నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి కూడా మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దర్యాప్తులోనే డ్రగ్స్ తయారీ కేంద్రం హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉన్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో శుక్రవారం స్థానిక నవోదయ కాలనీలోని 'వాగ్దేవి ల్యాబ్స్' అనే కంపెనీపై ఎన్‌సీబీ అధికారులతో కలిసి మెరుపుదాడి చేశారు. కంపెనీ యజమాని, ఐటీ నిపుణుడైన శ్రీనివాస్ విజయ్ ఒలేటితో పాటు తానాజీ పండరీనాథ్ పట్వారీని అరెస్ట్ చేశారు. ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారీకి వినియోగిస్తున్న అత్యాధునిక యంత్ర పరికరాలను గుర్తించారు.
ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినట్టు మీరా భయాండర్-వాసాయ్ విహార్ (ఎంబీవీవీ) పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి ఫ్యాక్టరీలో లభించిన ముడిసరుకుతో సుమారు రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను తయారు చేసే అవకాశం ఉందని సమాచారం.