Revanth Reddy: అకస్మాత్తుగా నిమజ్జనం వేడుకలో ప్రత్యక్షమైన రేవంత్ రెడ్డి.. "గణపతి బప్పా మోరియా" అంటూ నినాదాలు

Revanth Reddy Suddenly Appears at Necklace Road Immersion Ceremony
  • పరిమిత వాహనాలతో సాదాసీదాగా వచ్చిన రేవంత్ రెడ్డి
  • ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా నిమజ్జన ప్రక్రియ పరిశీలన
  • "భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి" వేదిక నుంచి భక్తులకు అభివాదం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. ఆయన ఆకస్మికంగా అక్కడికి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పరిమిత సంఖ్యలో వాహనాలతో, ఎలాంటి హడావుడి లేకుండా ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా సాధారణ పౌరుడిలా నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. "భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి" ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి భక్తులకు అభివాదం చేశారు.

"గణపతి బప్పా మోరియా" అంటూ భక్తులతో కలిసి నినాదాలు చేశారు. క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనాలను పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లను గురించి కలెక్టర్ హరిచందన ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా విధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పని చేయాలని వారికి సూచించారు.
Revanth Reddy
Telangana CM
Ganesh Chaturthi
Hussain Sagar
Immersion Ceremony
Bhagyanagar Ganesh Utsav Samithi

More Telugu News