Prabhas: వైరల్ అవుతున్న ప్రభాస్ ఆధార్ కార్డు!... పూర్తి పేరు ఇదేనా అంటూ చర్చ!
- కార్డులో ఉన్న పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్
- కార్డు ప్రకారం పుట్టిన తేదీ 23-10-1979గా గుర్తింపు
- ఇది నిజమైనదో, కాదో అధికారికంగా స్పష్టత కరవు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు చెందినదిగా చెబుతున్న ఓ ఆధార్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా అభిమానులకు ప్రభాస్ అని మాత్రమే తెలిసిన ఆయన పూర్తి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఈ కార్డులో ఉండటంతో ఇది వైరల్ అవుతోంది. దీనిపై ఆయన అభిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఆధార్ కార్డు ప్రకారం, ప్రభాస్ పూర్తి పేరు ‘ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్’ అని ఉంది. అలాగే, ఆయన పుట్టిన తేదీ 23 అక్టోబర్ 1979గా పేర్కొన్నారు. ఈ వివరాలను చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే, ఈ ఆధార్ కార్డు నిజమైనదా? లేక ఎవరో కావాలనే సృష్టించి ప్రచారంలో పెట్టారా? అనే విషయంపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. ఇది నిజమైన డాక్యుమెంటా? లేక ఫొటోషాప్ చేసిన చిత్రమా? అనేది తేలాల్సి ఉంది.
దివంగత నటుడు కృష్ణంరాజు వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభాస్, ‘వర్షం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘ఛత్రపతి’, ‘బిల్లా’, ‘మిర్చి’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రంతో ఆయన కీర్తి దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయికి చేరింది.
ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘సలార్’, ‘కల్కి 2898 AD’ చిత్రాలతో విజయాలను అందుకున్న ఆయన, త్వరలో మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే హారర్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు.