Balapur Laddu: మరోసారి రికార్డులు బద్దలుకొట్టిన బాలాపూర్ లడ్డూ

Balapur Laddu Sold for Record Price of 35 Lakhs
  • రూ. 35 లక్షలకు లడ్డూను లడ్డూను దక్కించుకున్న దశరథ్ గౌడ్
  • గతేడాది రూ. 30.01 లక్షల రికార్డు బ్రేక్
  • వేలం పాటలో హోరాహోరీగా పాల్గొన్న 38 మంది భ‌క్తులు
  • 1994లో రూ. 450తో మొదలైన వేలం ప్రస్థానం
ప్రతి ఏటా ఎంతో ఆసక్తి రేకెత్తించే బాలాపూర్ గణపతి లడ్డూ వేలం ఈసారి కూడా కొత్త రికార్డు నెలకొల్పింది. తన పాత రికార్డును తానే బద్దలు కొడుతూ ఈ ఏడాది ఏకంగా రూ. 35 లక్షల భారీ ధర పలికింది. వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ లడ్డూ వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది.

హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఈ ప్రతిష్ఠాత్మకమైన లడ్డూను దక్కించుకున్నారు. ఈ ఏడాది జరిగిన వేలం పాటలో మొత్తం 38 మంది పోటీ పడ్డారు. హోరాహోరీగా సాగిన ఈ వేలంలో చివరికి దీనిని దశరథ్ గౌడ్ ద‌క్కించుకున్నారు.

గతేడాది ఈ లడ్డూ రూ. 30.01 లక్షలకు అమ్ముడుపోగా, ఆ రికార్డును ఈ సంవత్సరం సునాయాసంగా అధిగమించింది. గతేడాది కొలను శంకర్ రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

కాగా, బాలాపూర్ లడ్డూ వేలం సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. అప్పట్లో కేవలం రూ. 450తో మొదలైన ఈ వేలం ప్రస్థానం, దశాబ్దాలు గడిచేసరికి లక్షల్లోకి చేరి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ లడ్డూను దక్కించుకుంటే శుభం కలుగుతుందని, వ్యాపారంలో వృద్ధి ఉంటుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం పోటీ తీవ్రంగా ఉంటుంది.
Balapur Laddu
Balapur Ganesh Laddu
Laddu Auction
Hyderabad
Lingala Dasharath Goud
Kolanu Shankar Reddy
Vinayaka Chavithi
Ganesh Chaturthi
Laddu Price
Karmaanghat

More Telugu News