Anushka Moni Mohandas: యువ నటీమణులతో వ్యభిచార దందా.. సినీ నటి అరెస్ట్

Actress Anushka Moni Mohandas Arrested in Prostitution Racket
  • నటి ముసుగులో వ్యభిచార దందా నిర్వహణ
  • మహారాష్ట్ర థానేలో గుట్టు రట్టు చేసిన పోలీసులు
  • నిందితురాలు అనుష్క మోని మోహన్‌దాస్‌ అరెస్ట్
నటన ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా నడుపుతున్న ఓ నటి గుట్టును పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టి, డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఈ సంచలన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 41 ఏళ్ల అనుష్క మోని మోహన్‌దాస్‌ అనే నటి కొంతకాలంగా ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తనతో పాటు పనిచేసే, అవకాశాల కోసం ఎదురుచూసే యువ నటీమణులను లక్ష్యంగా చేసుకుని వారిని ఈ ఊబిలోకి దింపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దందాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న థానే పోలీసులు, నిందితురాలిని పట్టుకోవడానికి పక్కా ప్రణాళిక రచించారు.

ఇద్దరు పోలీసు సిబ్బందిని డెకాయ్ కస్టమర్లుగా అనుష్క వద్దకు పంపించారు. వారు సంప్రదించగా, అనుష్క డీల్ ఖరారు చేసింది. వారు డబ్బు ఇస్తుండగా, ముందుగానే సిద్ధంగా ఉన్న పోలీసు బృందం ఒక్కసారిగా దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకుంది. ఈ దాడిలో టీవీ సీరియళ్లు, బెంగాలీ సినిమాల్లో నటిస్తున్న ఇద్దరు మహిళలను రక్షించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ మీడియాకు తెలిపారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 
Anushka Moni Mohandas
Thane
Prostitution racket
Actress arrested
Mumbai
Maharashtra police
TV serial actress
Bengali movies
Crime news
Decoy operation

More Telugu News