SIIMA Awards 2025: సైమా అవార్డ్స్ 2025లో 'పుష్ప' హవా.. విజేతలు వీరే..!

Allu Arjun Wins Best Actor at SIIMA Awards 2025 for Pushpa 2
  • దుబాయ్ వేదిక‌గా ఘ‌నంగా సైమా అవార్డ్స్ 2025 వేడుక‌
  • తెలుగులో అత్య‌ధికంగా 'పుష్ప2' నాలుగు అవార్డులు
  • ఉత్త‌మ చిత్రంగా 'క‌ల్కి 2898 ఏడీ' 
  • బెస్ట్ యాక్ట‌ర్‌గా అల్లు అర్జున్‌, ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా సుకుమార్‌
  • ఉత్త‌మ న‌టిగా ర‌ష్మిక మంద‌న్న‌, బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా దేవిశ్రీ ప్ర‌సాద్‌
'సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్' 2025 (సైమా) వేడుక దుబాయ్ వేదిక‌గా ఘ‌నంగా జ‌రుగుతోంది. మొదటి రోజు క‌న్న‌డ‌, తెలుగు చిత్రాల్లో త‌మ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న న‌టీన‌టులు, చిత్ర బృందాలు పుర‌స్కారాలు అందుకున్నారు. గ‌తేడాది విడుద‌లైన చిత్రాల‌తో విశేష ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన న‌టీన‌టులు, చిత్ర‌ యూనిట్ల‌కు అవార్డులు అంద‌జేశారు.   

సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా వ‌చ్చిన 'క‌ల్కి 2898 ఏడీ' ఉత్త‌మ చిత్రంగా నిలిచింది. ఇక‌, 13వ‌ 'సైమా' వేడుక‌ల్లో తెలుగులో అత్య‌ధికంగా 'పుష్ప2' నాలుగు అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ యాక్ట‌ర్‌గా అల్లు అర్జున్‌, ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా సుకుమార్‌, ఉత్త‌మ న‌టిగా ర‌ష్మిక మంద‌న్న‌, బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా దేవిశ్రీ ప్ర‌సాద్‌ నిలిచారు. అలాగే బెస్ట్ విల‌న్‌గా 'క‌ల్కి' చిత్రానికి గాను క‌మ‌ల్ హాస‌న్ నిలిస్తే.. ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌గా రామ‌జోగయ్య శాస్త్రి (దేవ‌ర‌-చుట్ట‌మ‌ల్లే) అవార్డు సొంతం చేసుకున్నారు.    

సైమా అవార్డ్స్ 2025 విజేత‌ల జాబితా ఇదే..
ఉత్త‌మ చిత్రం: క‌ల్కి 2898 ఏడీ 
బెస్ట్ యాక్ట‌ర్‌: అల్లు అర్జున్ (పుష్ప‌2)
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: సుకుమార్ (పుష్ప‌2) 
ఉత్త‌మ న‌టి: ర‌ష్మిక మంద‌న్న (పుష్ప‌2)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌: దేవిశ్రీ ప్ర‌సాద్ (పుష్ప‌2)
బెస్ట్ విల‌న్‌: క‌మ‌ల్ హాస‌న్ (క‌ల్కి 2898 ఏడీ)
ఉత్త‌మ స‌హాయ న‌టుడు: అమితాబ్ బ‌చ్చ‌న్ (క‌ల్కి 2898 ఏడీ)
ఉత్త‌మ స‌హాయ న‌టి: అన్నా బెన్ (క‌ల్కి 2898 ఏడీ)
ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌: రామ‌జోగయ్య శాస్త్రి (దేవ‌ర‌-చుట్ట‌మ‌ల్లే)
బెస్ట్ క‌మెడియ‌న్‌: స‌త్య (మ‌త్తు వ‌ద‌ల‌రా 2)
ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫీ: ర‌త్నవేలు (దేవ‌ర‌) 
ఉత్త‌మ గాయ‌ని: శిల్పారావ్ (దేవ‌ర‌-చుట్ట‌మ‌ల్లే) 
SIIMA Awards 2025
Allu Arjun
Pushpa 2
Sukumar
Rashmika Mandanna
Kalki 2898 AD
Devi Sri Prasad
Telugu cinema
South Indian movies
Ramajogayya Sastry

More Telugu News