Revanth Reddy: ఎమ్మెల్యేలు కోరుకుంటే మళ్లీ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి: టీపీసీసీ చీఫ్

Revanth Reddy will be CM again if MLAs want says TPCC Chief
  • వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళతామన్న మహేశ్ కుమార్ గౌడ్
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకొని వెళుతున్నామన్న టీపీసీసీ చీఫ్
  • సీబీఐలో కొంత లొసుగులు ఉన్న మాట వాస్తవమేనని వ్యాఖ్య
వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ముందుకు సాగుతామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కోరుకుంటే రేవంత్ రెడ్డే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకొని వెళుతున్నామని తెలిపారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్రమశిక్షణ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీబీఐలో కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు.
Revanth Reddy
Telangana PCC
Mahesh Kumar Goud
TPCC Chief
Telangana Congress
Kaleshwaram Project

More Telugu News