Vladimir Putin: డొనాల్డ్ ట్రంప్ తీరుపై పుతిన్ ఫైర్.. ఇంకా ఏ కాలంలో ఉన్నారంటూ విమర్శ

Vladimir Putin Fires at Donald Trump Approach to India and China
  • ఇండియా, చైనాలపై భారీగా సుంకాలు విధించడం సరికాదని వ్యాఖ్య
  • భాగస్వాములతో ప్రవర్తించే తీరు ఇది కాదంటూ మండిపాటు
  • వలసవాద కాలం నాటి పద్ధతులు ఇప్పుడు పనిచేయవంటూ ఎద్దేవా
ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా, ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన ఇండియా, చైనా వంటి దేశాలతో డీల్ చేసేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హితవు పలికారు. భారత్, చైనాలను సుంకాలతో బెదిరించి దారికి తెచ్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించడం సరికాదని అన్నారు. ట్రంప్ ఇంకా వలసవాద కాలంలోనే ఉన్నారని, అప్పటి పద్ధతులను అనుసరిస్తూ ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చాటుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అప్పటి పద్ధతులు ఇప్పుడు పనిచేయవని ఆయన ఎద్దేవా చేశారు.

వలసవాద కాలానికి, ఇప్పటికి ప్రపంచం మారిపోయిందని గుర్తించాలంటూ ట్రంప్ కు హితవు పలికారు. భారత్, చైనాలపై సుంకాలు విధించడం సరికాదన్నారు. భాగస్వామ్య దేశాలతో ఇలా ప్రవర్తించకూడదన్నారు. రెండు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితి తలెత్తిన సందర్భాల్లో ఒక దేశాధినేత బలహీనంగా కనిపించారంటే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుందని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిస్పందిస్తారని పుతిన్ వివరించారు. భాగస్వామ్య దేశాలతో సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి, పరిష్కారం కనుగొనాలే తప్ప పన్నులతో శిక్షిస్తానంటే కుదరదని పుతిన్ స్పష్టం చేశారు.
Vladimir Putin
Donald Trump
Russia
India
China
Tariffs
Colonialism
US Foreign Policy
Geopolitics
International Relations

More Telugu News