ఎన్డీఏకు దినకరన్ షాక్.. తమిళనాడులో కూటమిని వీడిన ఏఎంఎంకే
- ఎన్డీఏ కూటమికి తమిళనాడులో ఎదురుదెబ్బ
- ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రకటన
- ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్
ఈ విషయాన్ని ఏఎంఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ స్వయంగా వెల్లడించారు. ఇకపై తమ పార్టీ తమిళనాడులో ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగబోదని ఆయన తేల్చిచెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.
రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు దినకరన్ వివరించారు. భవిష్యత్ కార్యాచరణ, పొత్తుల విషయమై ఈ ఏడాది డిసెంబర్‌లో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ సమావేశంలోనే ఏ కూటమితో కలిసి పనిచేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని దినకరన్ వెల్లడించారు. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.