: భారత్‌పై ట్రంప్ కక్ష సాధింపు?.. 50 శాతం సుంకం వెనుక అసలు కథ ఇదేనా!
- భారత వస్తువులపై 50 శాతం భారీ సుంకాన్ని విధించిన అమెరికా
- రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే కారణమని చెబుతున్న ట్రంప్
- ట్రంప్ అహం దెబ్బతినడమే అసలు కారణమంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు
- పాక్‌తో శాంతి ఘనతను తనకు దక్కనీయలేదనే భారత్‌పై ట్రంప్ ఆగ్రహం
- చైనా, ఐరోపా దేశాల కన్నా భారత్‌నే లక్ష్యం చేసుకోవడంపై సందేహాలు
భారత వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 50 శాతం మేర భారీగా ప్రతీకార సుంకాలు విధించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈ ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా అధికారికంగా చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఆర్థిక కారణాల కన్నా ట్రంప్ వ్యక్తిగత అహమే ప్రధాన పాత్ర పోషించిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
"ఆపరేషన్ సిందూర్" అనంతరం పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తానే కుదిర్చానని ట్రంప్ చెప్పుకోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామంతో అహం దెబ్బతిన్న ట్రంప్, భారత్‌పై ప్రతీకార చర్యలకు దిగుతున్నారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. లండన్‌కు చెందిన ఓ ప్రముఖ దినపత్రిక ప్రకారం, "ట్రంప్ విధించిన 50 శాతం సుంకం ఆర్థికపరమైన అంశం కన్నా, తన అధికారాన్ని ప్రదర్శించుకోవడానికే ఎక్కువ సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది" అని పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను, వ్యూహాత్మక వైమానిక స్థావరాలను భారత సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది. ఆ తర్వాత, పాకిస్థానే కాల్పుల విరమణ కోసం అభ్యర్థించిందని, నిర్దేశిత లక్ష్యం పూర్తవడంతో తాము అంగీకరించామని భారత్ స్పష్టం చేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలను నివారించే శాంతిదూతగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ట్రంప్, ఈ ఘనతను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. భారత్ దీనిని అంగీకరించకపోవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
మరోవైపు, వాషింగ్టన్‌కు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా పాకిస్థాన్... ట్రంప్ వాదనకు మద్దతు పలకడమే కాకుండా, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఈ పరిణామం ట్రంప్ ఆగ్రహాన్ని మరింత పెంచిందని, భారత్‌ను ప్రత్యేకంగా లక్ష్యం చేసుకోవడానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా చెబుతున్నప్పటికీ, అందులో ద్వంద్వ నీతి స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలు రష్యా నుంచి 21.9 బిలియన్ యూరోల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకున్నాయి. ఇది వారు ఉక్రెయిన్‌కు అందించిన 18.7 బిలియన్ యూరోల సాయం కంటే ఎక్కువ. అంతేకాకుండా, భారత్ కంటే చైనా అత్యధికంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఆ దేశంపై ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి సుంకాలు విధించలేదు. ఈ నేపథ్యంలో ఈ చర్యల వెనుక అసలు ఉద్దేశం ఆర్థిక క్రమశిక్షణ కాదని, మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో ఇదొక అధికార ప్రదర్శన అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.