Neelam Sawhney: జనవరిలో స్థానిక పోరు.. ఏపీ ఎన్నికల సంఘం ఏర్పాట్లు

AP Local Body Elections Scheduled for January Preparations Underway
  • వచ్చే ఏడాది ఏప్రిల్ లో ముగియనున్న సర్పంచ్ ల పదవీకాలం
  • 3 నెలల ముందే ఎన్నికలు నిర్వహించే ఏర్పాట్లలో ఎస్ఈసీ
  • పంచాయతీరాజ్‌శాఖ, పురపాలక కమిషనర్లకు ఇప్పటికే లేఖలు
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సర్పంచ్ ల పదవీ కాలం, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం మార్చిలో ముగియనుండగా.. చట్టంలోని వెసులుబాట్ల మేరకు జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ మేరకు పురపాలక, పంచాయతీరాజ్ కమిషనర్లకు ఏపీ ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని బుధవారం లేఖలు రాశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.  

లేఖలో పేర్కొన్న షెడ్యూల్‌..
  • అక్టోబరు 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
  • నవంబరు 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ప్రచురణ
  • నవంబరు 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారుల నియామకం
  • నవంబరు 30లోగా పోలింగ్‌ కేంద్రాల ఖరారు, ఈవీఎంల ఏర్పాట్లు
  • డిసెంబరు 15లోపు రిజర్వేషన్లు ఖరారు
  • 2026 జనవరిలో నోటిఫికేషన్‌, ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన
Neelam Sawhney
AP Elections
Local Body Elections
Andhra Pradesh
SEC
Panchayat Elections
Municipal Elections
Election Schedule
Voter List

More Telugu News