ER Yamini: 40 మంది దర్శకులను కలిశాను: ఈఆర్ యామిని

ER Yamini Interview
  • సినిమాల దిశగా యామిని అడుగులు  
  • సినిమాలలోను పద్ధతి గల పాత్రలే చేస్తాను
  • 'అరుంధతి' తరహా పాత్రలు చేయాలనుంది 
  • కొన్ని  కథలు నాకు నచ్చాయి
  • తన భర్త .. తండ్రి ఒప్పుకున్నారన్న యామిని

యూట్యూబ్ స్టార్ గా ఈఆర్ యామినికి మంచి క్రేజ్ ఉంది. సంప్రదాయ బద్ధంగా కనిపిస్తూ ఆమె చేసే వీడియోస్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. యామినికి గల క్రేజ్ కారణంగానే ఆమెకి సినిమాలలోను అవకాశాలు వచ్చాయి. అయితే అలా వచ్చిన అవకాశాలను ఆమె సున్నితంగా తిరస్కరించారు. వివాహమైన తరువాత ఆమె ఇక వీడియోస్ చేయరని అభిమానులు అనుకున్నారు. కానీ భర్త ప్రోత్సాహంతో ఆమె ఇప్పుడు సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 

"తాజాగా '99 టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యామిని మాట్లాడుతూ .. "పెళ్లి తరువాత సినిమాలలో అవకాశాలు తగ్గుతాయని నాకు తెలుసు. అయినా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ కి వచ్చాను. ఈ విషయంలో నాన్న కాస్త అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆయనను ఒప్పించాను. మావారి సపోర్టు ఉండటం వలన నాన్న వెంటనే ఒప్పుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను ఆదరిస్తారనే నమ్మకం ఉంది" అని అన్నారు. 

"నా వాయిస్ కి .. ఏజ్ కి మ్యాచ్ కాదు. అయినా నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని ఉంది. కళాత్మక చిత్రాలలో .. 'అరుంధతి' తరహా పాత్రలలో నటించాలని ఉంది. నేను సంప్రదాయ బద్ధంగా కనిపించేలానే అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చిన ఈ నెల రోజులలో 40 మంది దర్శకులను కలిశాను. వాళ్లలో కొంతమంది వినిపించిన కథలు .. పాత్రలు నాకు సరిపోతాయని అనిపించింది. మంచి పాత్రలు పడితే నన్ను నేను నిరూపించుకోగలననే నమ్మకమైతే ఉంది" అని చెప్పారు. 

ER Yamini
Yamini
YouTube star
Telugu actress
99 TV interview
Telugu cinema
Hyderabad
acting offers
Arunthathi movie

More Telugu News