Mohan Srivatsa: అందుకే అంత ఎమోషనల్ అయ్యాను: 'త్రిబాణధారి బార్బరిక్' దర్శకుడు మోహన్ శ్రీవత్స!

Mohan Sri Vaatsa Interview
  • రీసెంటుగా థియేటర్స్ కి 'తిబాణధారి బార్బరిక్'
  • పెద్దగా పట్టించుకోని జనాలు 
  • తన చెప్పుతో కొట్టుకున్న డైరెక్టర్ 
  • టైటిల్ మైనస్ అంటున్న పబ్లిక్

 మోహన్ శ్రీ వత్స అనే దర్శకుడు మొన్న చెప్పు తీసుకుని తనని తాను కొట్టుకుంటూ వదిలిన ఒక వీడియో హాట్ టాపిక్ గా మారింది. ఆయన దర్శకత్వం వహించిన 'త్రిబాణధారి బార్బరిక్' అనే సినిమా, క్రితం నెల 28వ తేదీన థియేటర్లకి వచ్చింది. సత్యరాజ్ .. ఉదయభాను .. సత్యం రాజేశ్ తదితరులు ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, 10 మంది కూడా రాకపోవడం పట్ల ఆయన అలా అసహనాన్ని వ్యక్తం చేశాడు. 

తాజాగా 'సుమన్ టీవీ' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా రూపొందించాము. ఏ సినిమాకైనా కనీసం ఒక 30 - 40 మంది అయినా వస్తే, ఆ సినిమా టాక్ బయటికి వెళుతుంది. 10 మంది కూడా రాకపోవడం వలన, షో కేన్సిల్ అవుతుంది. అదే రోజున పక్కనే ఉన్న స్క్రీన్ కి వెళితే, అందులో ఏదో మలయాళ డబ్ మూవీ నడుస్తోంది ..  అక్కడ జనాలు బాగానే ఉన్నారు. ఎక్కడ తప్పు చేశాము అనేది నాకు అర్థం కాలేదు" అని అన్నారు. 

" రెండున్నరేళ్ల పాటు ఆ ప్రాజెక్టుపై నేను పనిచేశాను. అందువలన నేనెక్కడ సూసైడ్ చేసుకుంటానోనని మా ఆవిడ కంగారు పడింది. మా నిర్మాత మొదలు చాలామంది కాల్ చేసి నాకు ధైర్యం చెప్పారు. ప్రమోషన్స్ గట్టిగానే చేశాము. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఎందుకు ఇలా జరిగింది అనేదే నాకు అర్థం కావడం లేదు అని అన్నారు. ఈ సినిమాకి టైటిల్ మెయిన్ మైనస్ అనీ, టైటిల్ అర్థం కాకపోవడం వల్లనే జనాలు థియేటర్స్ కి వెళ్లలేదనే కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

Mohan Srivatsa
Tribanadhari Barbareek
Telugu movie
Satyaraj
Udayabhanu
Satyam Rajesh
movie promotions
Telugu cinema
box office failure
movie title

More Telugu News