: నందిగామలో కరెన్సీ గణపతి.. రూ.3.10 కోట్ల నోట్లతో అలంకరణ
––
ఆంధ్రప్రదేశ్ లోని నందిగామలో వినాయకుడిని నిర్వాహకులు కరెన్సీ నోట్లతో అలంకరించారు. స్థానిక వాసవి మార్కెట్ గణపతి మండపంలో ఏర్పాటు చేసిన గణేషుడి విగ్రహాన్ని రూ.3.10 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. విగ్రహంతో పాటు మండపానికి కరెన్సీ నోట్లను వేలాడదీశారు. కమిటీ 43వ వార్షిక ఉత్సవాల సందర్భంగా ఈ అలంకరణ చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దీంతో కరెన్సీ నోట్ల అలంకరణలో ఉన్న వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారని తెలిపారు.