Dulquer Salmaan: 'కొత్త లోక’ డైలాగ్ వివాదం: క్షమాపణలు తెలిపిన దుల్కర్ సల్మాన్ టీమ్
- దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రంపై డైలాగ్ వివాదం
- బెంగళూరు మహిళలను కించపరిచేలా సంభాషణలు ఉన్నాయని ఆరోపణ
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కన్నడిగులు
- సినిమా నుంచి డైలాగ్ తొలగిస్తామని దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ హామీ
ప్రముఖ నటుడు, నిర్మాత దుల్కర్ సల్మాన్ తన నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రంపై చెలరేగిన వివాదంపై క్షమాపణలు తెలిపారు. ఆయన నిర్మించిన ‘లోక చాప్టర్ 1 చంద్ర’ చిత్రంలోని ఒక డైలాగ్ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్న విమర్శల నేపథ్యంలో ఆయన నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ అధికారికంగా స్పందించింది. వివాదాస్పద సంభాషణను సినిమా నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చింది.
ఇటీవల మలయాళంలో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం, తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా క్లైమాక్స్‌లో విలన్ పాత్రధారి బెంగళూరుకు చెందిన అమ్మాయిల వ్యక్తిత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వారిని కించపరిచేలా ఉన్న ఆ డైలాగ్‌తో పాటు, సినిమాలో ‘దగర్’ (వేశ్య) అనే పదాన్ని ఉపయోగించడం కూడా వివాదానికి కారణమైంది. దీంతో కర్ణాటకకు చెందిన పలువురు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై స్పందించిన దుల్కర్ నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. "మా సినిమాలోని సంభాషణ కర్ణాటక ప్రజల మనోభావాలను అనుకోకుండా దెబ్బతీసిందని మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో మేము చింతిస్తున్నాము. ఎవరినీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఆ వివాదాస్పద డైలాగ్‌ను వీలైనంత త్వరగా తొలగించడం లేదా మార్చడం జరుగుతుంది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. "మేము కలిగించిన ఈ ఇబ్బందికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం. దయచేసి మా క్షమాపణను అంగీకరించండి" అని చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది.
కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్న తరుణంలో ఈ వివాదం చోటుచేసుకుంది.