ER Yamini: సినిమాల్లో చేయడం కోసమే తిరిగొచ్చాను: ఈఆర్ యామిని!

ER Yamini Interview
  • ఈఆర్ యామినికి విపరీతమైన క్రేజ్
  • యూత్ లో మంచి ఫాలోయింగ్ 
  • యూకేలోనూ గుర్తుపట్టారన్న యామిని 
  • తనకి భర్త సపోర్ట్ ఉందని వెల్లడి 
  • ఇకపై సినిమాలు చేస్తానని స్పష్టీకరణ 

ఈఆర్ యామిని .. యూత్ లో ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. యూట్యూబ్ స్టార్ గా ఆమె చాలా కాలంగా చాలా మందికి తెలుసు. అచ్చమైన తెలుగుదనం .. స్వచ్ఛమైన చిరునవ్వు .. ఆకర్షణీయమైన రూపం .. ఆకట్టుకునే చీరకట్టు .. ఇవన్నీ కలిస్తే ఈఆర్ యామిని. పద్ధతికి పద్ధతి నేర్పే అమ్మాయిలా ఉండే యామినిని, అభిమానులంతా జూనియర్ సౌందర్యగా ప్రశంసిస్తూ ఉంటారు. సినిమాలలో అవకాశాలు వస్తున్న సమయంలోనే, ఆమె వివాహం చేసుకుని యూకే వెళ్లిపోవడం జరిగింది.

ఇకపై ఆమె యూట్యూబ్ వీడియోలు చేయకపోవచ్చని అభిమానులు నిరాశ చెందారు. కానీ ఇప్పుడు ఆమె సినిమాలు చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ కి తిరిగొచ్చారు. తాజాగా '99 టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. యామిని మాట్లాడుతూ " నా పెళ్లికి ముందు మా ఫ్యామిలీ వాళ్లంతా నాకు ఎంతో సహకరించారు. పెళ్లి తరువాత మా వారు కూడా ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. యూకేలో నన్ను  చాలామంది తెలుగువారు గుర్తుపట్టారు. ఎంతో ఆత్మీయంగా పలకరించడమే కాకుండా భోజనానికి కూడా పిలిచేవారు" అని అన్నారు.

"నా యాక్టింగ్ .. డాన్స్ మా వారు చూశారు. అలాగే నాకు దక్కుతున్న గుర్తింపును .. గౌరవాన్ని కూడా  చూశారు. ఇంత టాలెంట్ ను యూట్యూబ్ కి పరిమితం చేయకూడదు .. సినిమాలలో ట్రై చేయమని అన్నారు. ఆయన నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే ఇండియా వచ్చేశాను. ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నాను. కొన్ని ప్రాజెక్టులు సెట్ అవుతున్నాయి. సౌందర్య మాదిరిగా పద్ధతి గల పాత్రలను చేయాలనుకుంటున్నాను" అని చెప్పారు. 

ER Yamini
Yamini
actress
Telugu actress
junior Soundarya
Youtube star
Tollywood
99 TV interview
Hyderabad
UK

More Telugu News