Chandrababu: 30 ఏళ్ల జ‌ర్నీ.. చంద్రబాబు స్పెష‌ల్‌ పోస్ట్

Chandrababu Naidu 30 Years as CM Emotional Post
  • ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారి ప్రమాణం చేసి 30 ఏళ్లు పూర్తి
  • ఈ సందర్భంగా 'ఎక్స్' వేదికగా చంద్రబాబు ప్రత్యేక పోస్ట్
  • ప్రజాసేవకు 30 రెట్ల కృతనిశ్చయంతో ఉన్నానని వెల్లడి
  • ఈ మైలురాయిని రాష్ట్ర ప్రజలకే అంకితం చేస్తున్నట్లు ప్రకటన
  • అభినందనలు తెలిపిన గవర్నర్, పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కీలక మైలురాయిని పురస్కరించుకుని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. తన మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని స్మరించుకుంటూ, ప్రజాసేవ పట్ల తన నిబద్ధత మరింత పెరిగిందని స్పష్టం చేశారు.

ఈ 30 ఏళ్ల ప్రయాణం స్ఫూర్తితో, ప్రజలకు సేవ చేసేందుకు తనలో సంకల్పం 30 రెట్లు పెరిగిందని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ఈ మైలురాయిని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా తనను నడిపిస్తున్న రాష్ట్ర ప్రజలకే అంకితం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ ప్రత్యేక సందర్భంలో తనకు అభినందనలు తెలియజేసిన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Chandrababu
Andhra Pradesh
TDP
30 years
Political Journey
Pawan Kalyan
Abdul Nazeer
Social Media Post
Governance

More Telugu News