Kavitha: కాళేశ్వరం విషయంలో కవిత వ్యాఖ్యలు... స్పందించిన కాంగ్రెస్ ఎంపీ

Kavitha Remarks on Kaleshwaram Project Congress MP Response
  • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగినట్లు కవిత ఒప్పుకున్నారన్న ఎంపీ
  • ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత చెప్పకనే చెప్పారన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • పీసీ ఘోష్ నివేదికను బలపరుస్తున్నట్లు కవిత మాట్లాడారని వ్యాఖ్య
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగినట్లు కవిత అంగీకరించారని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆమె చెప్పకనే చెప్పారని ఆయన పేర్కొన్నారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీసీ ఘోష్ నివేదికను కవిత బలపరుస్తున్నట్లుగా మాట్లాడారని అన్నారు. నిన్న అసెంబ్లీలో చర్చను ఆమోదించినట్లు మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కారకులు ఎవరనే విషయం పక్కన పెడితే కాళేశ్వరంలో కుంభకోణం జరగడం వాస్తవమని ఆయన స్పష్టం చేశారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 

హరీశ్ రావు వల్లే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందని కవిత ఆరోపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చామల స్పందించారు. 
Kavitha
Kaleshwaram Project
Chamala Kiran Kumar Reddy
Telangana
BRS
Congress
Corruption

More Telugu News