Dhanashree Verma: ఇప్పుడు స్వాతంత్ర్యాన్ని ఆస్వాదిస్తున్నా: ధనశ్రీ వర్మ

Dhanashree Verma Enjoys Freedom After Divorce with Chahal
  • యూట్యూబ్ వ్లాగ్‌లో ఫరా ఖాన్‌తో ధనశ్రీ వర్మ సంభాషణ
  • క్రికెటర్ యుజ్వేంద్ర చహల్‌తో విడిపోయినట్లు ధృవీకరణ
  • ప్రస్తుతం కొత్త జీవితం గడుపుతున్నానని వ్యాఖ్య
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మ ఓ వ్లాగ్‌లో తన వ్యక్తిగత జీవితంలో జరిగిన మార్పుల గురించి మాట్లాడారు. భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్‌తో తన నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం తాను ఒంటరిగా కొత్త జీవితాన్ని ప్రారంభించానని, స్వాతంత్ర్యాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. తన డ్యాన్స్ రియాలిటీ షో 'ఝలక్ దిఖ్లా జా'లో పాల్గొన్న అనుభవాలను కూడా పంచుకున్నారు. అంతేకాకుండా, త్వరలో 'రైజ్ అండ్ ఫాల్' అనే మరో రియాలిటీ షోలో కూడా కనిపించనున్నట్లు ఆమె వెల్లడించారు

తన జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన నిజాన్ని కూడా ధనశ్రీ వర్మ ఈ వ్లాగ్ లో బయటపెట్టారు. డ్యాన్సర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా అందరికీ సుపరిచితమైన ఆమె, ఒకప్పుడు దంతవైద్యురాలిగా పనిచేశానని, ఆ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు కూడా చికిత్స అందించానని వెల్లడించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్‌తో జరిపిన సంభాషణలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.

ధనశ్రీ వర్మ ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ కోసం ఒక ప్రత్యేక వ్లాగ్ చిత్రీకరించారు. ఇందులో భాగంగా ఆమె ఇంటికి ఫరా ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ధనశ్రీ ఇంటి అలంకరణ, బాల్కనీలోని పచ్చదనం, ఆమె అమ్మమ్మ గీసిన అందమైన పెయింటింగ్స్‌ను ఫరా ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ సరదా సంభాషణలోనే ధనశ్రీ తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. తాను వినోద రంగంలోకి రాకముందు మూడేళ్ల పాటు దంతవైద్యురాలిగా ప్రాక్టీస్ చేశానని తెలిపారు. ముంబైలోని బాంద్రా, లోఖండ్‌వాలా ప్రాంతాల్లోని క్లినిక్‌లలో పనిచేసినట్లు చెప్పారు. ఆ సమయంలో చాలా మంది టీవీ ప్రముఖులతో పాటు, స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు కూడా డెంటల్ ట్రీట్‌మెంట్ ఇచ్చానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ విషయం వినగానే ఫరా ఖాన్ తనదైన శైలిలో చమత్కరించారు. "అవునా! నువ్వు రణ్‌బీర్ నోటి లోపలికి చూశావా? ఎలా ఉంది? ఏమైనా ప్రత్యేకంగా అనిపించిందా?" అంటూ సరదాగా ప్రశ్నించారు. ఫరా అడిగిన ప్రశ్నకు ధనశ్రీ నవ్వుతూ సమాధానమిచ్చారు. "అది నా వృత్తిలో భాగం కదా. అతని నోటి ఆరోగ్యం చాలా బాగుంది. ఆయన చాలా శుభ్రంగా ఉంటారు" అని వృత్తిపరమైన సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Dhanashree Verma
Yuzvendra Chahal
Dhanashree Verma divorce
Farah Khan
Ranbir Kapoor
Jhalak Dikhhla Jaa
Rise and Fall reality show
dance choreographer
Bollywood
dental treatment

More Telugu News