Bandaru Dattatreya: 'అలయ్ బలయ్' కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించిన బండారు దత్తాత్రేయ
- రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును కలిసిన దత్తాత్రేయ
- అక్టోబర్ 3న హైదరాబాద్‌లో 'అలయ్ బలయ్' కార్యక్రమం
- ప్రత్యేక అతిథిగా ఆహ్వానించిన మాజీ గవర్నర్
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో ముర్మును కలిశారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమం గురించి బండారు దత్తాత్రేయ రాష్ట్రపతికి వివరించారు. ప్రేమ, ఆప్యాయత, సోదరభావం చాటే అలయ్ బలయ్ కార్యక్రమం చాలా మంచిదని, అనేక సంవత్సరాలుగా ప్రతి ఏటా ఇది కొనసాగడం సంతోషకరమైన విషయమని రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు.