Kavitha: బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి కవిత పీఆర్వో తొలగింపు

Kavitha PRO Removed from BRS Official WhatsApp Groups
  • కవిత ప్రెస్ నోట్, వీడియో క్లిప్పింగ్‌లను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించిన పార్టీ
  • హరీశ్ రావు, సంతోష్ రావులకు వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యల తొలగింపు
  • హరీశ్ రావు ఆరడుగుల బుల్లెట్టు అంటూ బీఆర్ఎస్ కితాబు
బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి ఎమ్మెల్సీ కవిత పీఆర్వోను పార్టీ తొలగించింది. కవిత ప్రెస్ నోట్, వీడియో క్లిప్పులను సైతం వాట్సాప్ గ్రూప్‌ల నుంచి తొలగించింది. అదేవిధంగా హరీశ్ రావు, సంతోష్ రావులకు వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యల సారాంశాన్ని కూడా తొలగించింది.

మరోవైపు, అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఆదివారం మాట్లాడిన హరీశ్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ 'ఎక్స్‌'లో పోస్టు చేసింది. "ఇది ఆరడుగుల బుల్లెట్టు" అంటూ రాసుకొచ్చింది. "సింహం సింగిల్‌గానే వస్తుంది" అంటూ హరీశ్ రావును ఉద్దేశించి బీఆర్ఎస్ పోస్టు చేసింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టినట్లు పేర్కొంది.
Kavitha
BRS
BRS WhatsApp Group
Kalvakuntla Kavitha
Harish Rao
Kaleshwaram Project
Telangana Politics

More Telugu News