Teja Sajja: అది మహేశ్ బాబు కాదు: తేజా సజ్జా

Teja Sajja Clarifies Mahesh Babu Rumors in Mirai Movie
  • 'మిరాయ్‌'లో మహేశ్ బాబు ఉన్నారా? అంటూ సోషల్ మీడియాలో చర్చ 
  • తేజ సజ్జా క్లారిటీ
  • 'మిరాయ్‌'లో మహేశ్ బాబు లేరని వెల్లడి 
  • రాముడి పాత్రధారిని సర్‌ప్రైజ్‌గా ఉంచుతున్నామన్న హీరో
  • 'మిరాయ్' లో విలన్‌గా మంచు మనోజ్, కీలక పాత్రలో శ్రియ
  • సెప్టెంబర్ 12న సినిమా విడుదల
'హను-మాన్' చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన యువ కథానాయకుడు తేజ సజ్జా, ఇప్పుడు 'మిరాయ్‌' అనే మరో సూపర్‌హీరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ట్రైలర్‌లో కనిపించిన రాముడి పాత్రను సూపర్ స్టార్ మహేశ్ బాబు పోషించారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ రూమర్లపై హీరో తేజ సజ్జా స్వయంగా స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చారు.

చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో తేజ మాట్లాడుతూ, 'మిరాయ్‌' చిత్రంలో మహేశ్ బాబు నటించారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. "ట్రైలర్‌లో రాముడి పాత్రధారి ఎవరనేది ఉద్దేశపూర్వకంగానే సస్పెన్స్‌గా ఉంచాం. ప్రేక్షకులకు థియేటర్లలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని, సర్‌ప్రైజ్‌ను ఇవ్వాలన్నదే మా చిత్ర బృందం ఆలోచన," అని ఆయన వివరించారు. రాముడి పాత్ర కోసం ఏఐ టెక్నాలజీని వాడారని వస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు.

కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండటం విశేషం. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటి శ్రియ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. తనకు చిన్నప్పటి నుంచి సోషియో ఫాంటసీ కథలంటే ఎంతో ఇష్టమని, నిజ జీవితంలో సాధ్యం కాని అద్భుతాలను తెరపై చూపించడం తనకు థ్రిల్ ఇస్తుందని తేజ అన్నారు. 'మిరాయ్‌' అనే పదానికి 'భవిష్యత్తుపై ఆశ' అని అర్థం అని ఆయన తెలిపారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Teja Sajja
Mirai movie
HanuMan
Karthik Ghattamaneni
Manchu Manoj
Rithika Naik
Shriya
Super hero movie
Telugu cinema
Mirai trailer

More Telugu News