రామ్ గోపాల్ వర్మ ఒక సైతాన్: జగపతిబాబు
- జగపతి బాబు హోస్ట్‌గా 'జయమ్ము నిశ్చయంబురా' టాక్ షో
- ప్రత్యేక అతిథులుగా సంచలన దర్శకులు ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా
- ఆర్జీవీని 'సైతాన్' అంటూ పరిచయం చేసిన జగ్గూభాయ్
తెలుగు సినీ పరిశ్రమలోని ఇద్దరు సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా ఒకే వేదికపై సందడి చేశారు. విలక్షణ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోకు వీరిద్దరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకరిని 'డెవిల్', మరొకరిని 'యానిమల్' అంటూ జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు ఈ షోపై అంచనాలను పెంచుతున్నాయి.
షోలోకి రామ్ గోపాల్ వర్మను ఆహ్వానిస్తూ, "అందరికీ ఆయన ఆర్జీవీ అయితే, నాకు మాత్రం సైతాన్" అంటూ జగపతి బాబు పరిచయం చేయడం అందరినీ ఆకట్టుకుంది. దీనికి వర్మ నవ్వుతూ స్పందించారు. "ప్రేక్షకుల కోసం ఎప్పుడు సినిమా తీస్తారు?" అని జగపతి బాబు ప్రశ్నించగా, "నా జీవితంలో నేను నేర్చుకున్నది ఒక్కటే.. ఏం చెప్పినా ఎవరూ వినరు" అంటూ ఆర్జీవీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
ఆ తర్వాత షోలోకి సందీప్ రెడ్డి వంగాను ఆహ్వానించిన జగపతి బాబు, ఆయనకు బహుమతిగా ఒక వోడ్కా బాటిల్‌ను అందించారు. ఇది చూసిన ఆర్జీవీ, "నాకెందుకు ఇవ్వలేదు? సందీప్ పెద్ద డైరెక్టర్... నేను కాదు అని ఇవ్వలేదా?" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీనిపై జగపతి బాబు స్పందిస్తూ, "మీ ఇద్దరినీ చూస్తుంటే ఒక డెవిల్, ఒక యానిమల్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూస్తున్నట్లు ఉంది" అని అనడంతో నవ్వులు పూశాయి.
సంభాషణ మధ్యలో, "మనం ఇద్దరం క్లాస్‌మేట్స్ అయితే ఎలా ఉంటుంది?" అని సందీప్ రెడ్డి అడగ్గా, "అలా అయితే మనలో ఎవరో ఒకరు అమ్మాయిగా పుట్టాలి" అని ఆర్జీవీ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఇలా ఆద్యంతం ఫన్నీగా, ఆసక్తికరంగా సాగిన ఈ ప్రోమో, పూర్తి ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. త్వరలోనే ఈ పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది.