ఒకప్పుడు ఫ్యామిలీ ఫస్టు .. ఇప్పుడు డబ్బే ముఖ్యం: నటి గీతా సింగ్
- 'కితకితలు'తో హాస్యనటిగా మంచి పేరు
- ఆ సంఘటన తరువాత తేరుకోలేదని వెల్లడి
- 22 లక్షలు పోయాయని ఆవేదన
- ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని వివరణ
గీతా సింగ్ .. హాస్యనటిగా తనకి మంచి పేరు ఉంది. 'కితకితలు' సినిమాతో ఆమె కెరియర్ పతాకస్థాయికి చేరుకుంది. అయితే ఆ తరువాత నుంచి ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కొంతకాలంగా ఆమె అసలు తెరపై కనిపించలేదు. అందుకు కారణం ఏమిటనే ప్రశ్న ఆమెకి తాజాగా 'బిగ్ టీవీ' ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకు గీతా సింగ్ స్పందిస్తూ, తాను దత్తత చేసుకున్న కొడుకు ప్రమాదంలో చనిపోయాడనీ .. ఆ షాక్ లోనే తాను ఉండిపోయానని చెప్పారు.
"ఇండస్ట్రీకి చెందిన ఒకావిడ దగ్గర 'చీటీ' వేశాను. ఆమె మోసం చేయదనే నమ్మకం బలంగా ఉండేది. చీటీ మొత్తం కట్టడం అయిపోయింది. 22 లక్షలు నాకు రావాల్సి ఉంది. దాంతో డబ్బులు ఇవ్వమని ఆమె ఇంటికి వెళితే, ఇంట్లో సామాన్లు ఏమీ లేవు. ఆ విషయం గురించి అడిగితే వేరే చోటికి షిఫ్ట్ అవుతున్నట్టుగా చెప్పింది. ఆ తరువాత ఆమె అందరినీ మోసం చేసి పారిపోయినట్టుగా న్యూస్ వచ్చేసింది. రూపాయి .. రూపాయి దాచుకుని కట్టిన డబ్బు అది.
"ఆ సంఘటనను నేను తట్టుకోలేకపోయాను. ఆ సమయంలోనే నేను సూసైడ్ కి కూడా ట్రై చేశాను. నేను అటు బయట వాళ్ల దగ్గర .. ఇటు ఇంట్లో వాళ్ల దగ్గర కూడా మోసపోయాను. అందువలన అందరికీ నేను ఒకటే మాటా చెబుతూ ఉంటాను .. ఎవరినీ నమ్మవద్దని, ఎప్పుడూ మన జాగ్రత్తలో మనం ఉండాలని. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ఫస్టు అనుకునే దానిని, కానీ నాకు ఎదురైన అనుభవాలను బట్టి చెబుతున్నాను .. డబ్బే ముఖ్యం" అని చెప్పారు.