Bhavana: ఓటీటీకి వచ్చేసిన తమిళ హారర్ థ్రిల్లర్!

The Door Movie Update
  • భావన ప్రధానమైన పాత్రగా 'ది డోర్'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  • మార్చిలో థియేటర్లకు వచ్చిన సినిమా  
  • ఓటీటీలో దూసుకుపోతున్న కంటెంట్  

కోలీవుడ్ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాలలో 'ది డోర్' ఒకటి. భావన ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. నవీన్ రాజన్ నిర్మించిన ఈ సినిమాకి, జైదేవ్ దర్శకత్వం వహించాడు. వరుణ్ ఉన్ని సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, మార్చి 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్స్  వైపు నుంచి ఫరావాలేదనిపించుకున్న ఈ సినిమా, ఆగస్టు 29వ తేదీ నుంచి 'ఆహా తమిళ్' లో స్ట్రీమింగ్ అవుతోంది.

భావనకు తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే కన్నడలో ఆమె ఎక్కువ బిజీగా ఉండటం వలన, తెలుగు .. తమిళ భాషల్లో సినిమాలను తగ్గించింది. అలా 13 ఏళ్ల తరువాత తమిళంలో ఆమె చేసిన సినిమానే ఇది. తన సోదరుడు జైదేవ్ దర్శకత్వం వహించిన కారణంగా ఈ సినిమాను ఆమె ఒప్పుకుందని అంటారు.  అలాంటి ఈ సినిమాలో ఆమె ప్రధానమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్య పాత్రలలో గణేశ్ వెంకట్రామన్ .. ప్రియా  వెంకట్ .. జయప్రకాశ్ కనిపిస్తారు. 

కథ విషయానికి వస్తే, మిత్ర ఒక ఆర్కిటెక్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఒక రోజున ఆమె నిర్మాణ దశలో ఉన్న ఒక సైట్ కి వెళుతుంది. అక్కడ ఆమెకి కొన్ని చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. దాంతో అక్కడ ఏదో సూపర్ నేచురల్ పవర్ ఉందనే విషయం ఆమెకి అర్థమవుతుంది. దాంతో ఆ విషయాన్ని పరిశీలించాలని నిర్ణయించుకుంటుంది. ఫలితంగా ఆమెకి ఎదురయ్యే పరిస్థితులే ఈ సినిమా. పస్తుతం ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. 

Bhavana
The Door movie
Tamil horror thriller
Aha Tamil
Kollywood horror movies
Ganesh Venkatraman
Priya Venkat
Jayaprakash
Tamil movies OTT release

More Telugu News