Rao Gopal Rao: రావు గోపాలరావుకి ఛాన్స్ ఇచ్చిందే ఎస్వీఆర్!

Rao Gopala Rao Special
  • రావు గోపాలరావుకి నాటకాల పిచ్చి ఎక్కువ 
  • ఆయన నటన ఎస్వీఆర్ ను ఆకట్టుకుంది 
  • సినిమాల్లో ఆయన రాణిస్తాడని చెప్పింది ఎస్వీఆరే
  • రావు గోపాలరావు ఫస్టు మూవీ అదే!

తెలుగు తెరకి తనదైన విలనిజాన్ని పరిచయం చేసిన నటుడు రావు గోపాలరావు. ఆయన డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా ఉండేది. అదే ఆయనకి ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టింది. అలాంటి రావు గోపాలరావు గురించి దర్శకుడు నందం హరిశ్చంద్రరావు ప్రస్తావించారు. ట్రీ మీడియా వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రావు గోపాలరావు గురించిన విశేషాలను పంచుకున్నారు. 

"రావు గోపాలరావు గారు కాకినాడ దగ్గరలోని 'గంగనపల్లి'లో పుట్టి పెరిగారు, మొదటి నుంచి కూడా ఆయనకి నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. స్నేహితులతో కలిసి కాకినాడ పరిసరాలలో ఆయన ఎక్కువగా నాటకాలు వేస్తూ ఉండేవారు. ఒకసారి కాకినాడ వెళ్లిన ఎస్వీఆర్, అక్కడ 'కీర్తిశేషులు' నాటకంలో రావు గోపాలరావు నటన చూసి మెచ్చుకున్నారు. సినిమాలలో రాణిస్తావనని చెప్పిన ఆయన, ఏదైనా అవకాశం ఉంటే తాను కబురు చేస్తానని వెళ్లిపోయారు.

" కొన్ని రోజులు వెయిట్ చేసిన రావు గోపాలరావు, తన గురించి ఎస్వీఆర్ మరిచిపోయి ఉంటారని భావించి, మద్రాస్ వెళ్లి కలిశారు. ఆ సమయంలో ఎస్వీఆర్, గుమ్మడిగారి 'పోతన' సినిమాలో చేస్తున్నారు. ఆ సినిమాలో సింగనామాత్యుని పాత్రకు ఎవరినో పెట్టడం పట్ల ఎస్వీఆర్ అసహనాన్ని ప్రదర్శించారు. ఆ పాత్రకు రావు గోపాలరావును సిఫార్స్ చేశారు. అలా రావు గోపాలరావు గారి ఎంట్రీ ఎస్వీఆర్ ద్వారా జరిగింది. ఆ తరువాత రావు గోపాలరావు సృష్టించిన సంచలనం మనందరికీ తెలిసిందే" అని ఆయన అన్నారు. 

Rao Gopal Rao
SVR
SV Ranga Rao
Telugu cinema
actor
villain
Potana movie
Singanamaatya role
Nandam Harishchandra Rao
Kakinada
Ganganapalli

More Telugu News