' బొంబైకి రాను ..' సాంగ్ హిట్ అయ్యాక నాకేమీ ఇవ్వలేదు: డాన్సర్ లిఖిత!

  • 'రాను .. బొంబైకి రాను' పాటతో పాప్యులర్ 
  •  డాన్స్ అంటే ఇష్టమన్న లిఖిత 
  • పేరెంట్స్ సపోర్ట్ ఉందని వెల్లడి 
  • యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉందని వివరణ 
  • కోటి వచ్చిందన్నది నిజమేనని వ్యాఖ్య  

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వినిపించిన పాట .. కనిపించిన పాట, చిన్నపిల్లలు మొదలు పెద్దవాళ్లతో సైతం స్టెప్పులు వేయించిన పాట 'రాను .. బొంబైకి రాను'. రాము రాథోడ్ - లిఖిత కలిసి చేసిన ఈ పాట, సరిహద్దులు దాటి వెళ్లింది. ఈ పాట వినిపించని ఫంక్షన్ లేదంటే అతిశయోక్తి లేదు. అందువల్లనే ఈ పాటకి యూ ట్యూబ్ నుంచి కోటి రూపాయలు వచ్చాయని ఒక ఇంటర్వ్యూలో రాము రాథోడ్ చెప్పాడు. 

ఈ పాటతో మరింత పాప్యులర్ అయిన డాన్సర్ లిఖిత మాట్లాడుతూ, "మా అమ్మగారు వాళ్లది శ్రీ కాకుళం. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. మా అమ్మానాన్నలే నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. నాది ఇంటర్ అయిపోయింది. మా తమ్ముడు తొమ్మిదో క్లాస్ చదువుతున్నాడు. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అన్నా .. యాక్టింగ్ అన్నా చాలా ఇష్టం. ప్రతి రోజూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. 'రాను .. బొంబైకి రాను' సాంగ్ తరువాత, నన్ను అందరూ గుర్తుపడుతున్నారు" అని చెప్పింది. 

" ఈ పాటకి రాము రాథోడ్ కి కోటి రూపాయలు వచ్చిన మాట నిజమే. అయితే అతను హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నాడు .. బెంజ్ కారు కొన్నాడు వంటి మాటల్లో నిజం లేదు. ఈ సాంగ్ కోసం నేను రెండు రోజులు పనిచేశాను. ముందుగా మాట్లాడుకున్నట్టుగా నా పారితోషికం నాకు ఇచ్చేశారు. ఈ సాంగ్ వైరల్ కావడంతో యూ ట్యూబ్ నుంచి వచ్చిన కోటి రూపాయలలో నాకు ఏమీ ఇవ్వలేదు. నేను అడగలేదు కూడా. ఇవ్వడం .. ఇవ్వకపోవడం వాళ్ల ఇష్టం" అని చెప్పింది.



More Telugu News