Ram Charan: కర్ణాటక సీఎంతో రామ్ చరణ్ భేటీ

Ram Charan Meets Karnataka CM Siddaramaiah
  • మైసూరులో పెద్ది షూటింగ్
  • అదే సమయంలో మైసూరు పర్యటనకు వచ్చిన సీఎం సిద్ధరామయ్య 
  • తనను కలవాలని రామ్ చరణ్ కు సీఎం ఆహ్వానం 
  • రామ్ చరణ్ తో ప్రధానంగా సినిమాల గురించి చర్చించిన కర్ణాటక సీఎం
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ ఆదివారం నాడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రామ్‌చరణ్‌ ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ కోసం మైసూరులో ఉన్నారు. అదే సమయంలో, సీఎం సిద్ధరామయ్య కూడా మైసూరు పర్యటనకు విచ్చేశారు. ఈ క్రమంలో, ఆయన రామ్ చరణ్ ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్... మైసూరులో సీఎం సిద్ధరామయ్యను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు.

ప్రస్తుతం రామ్‌చరణ్‌, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ కొన్ని రోజులుగా మైసూరులో జరుగుతోంది. ఇదే సమయంలో సీఎం సిద్ధరామయ్య కూడా నగరంలో ఉండటంతో, రామ్‌చరణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ భేటీలో రామ్‌చరణ్‌ ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించగా, సిద్ధరామయ్య కూడా చెర్రీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సమావేశంలో ఇద్దరూ ప్రధానంగా సినిమాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం.

‘పెద్ది’ చిత్రానికి సంబంధించి మైసూరులో ప్రస్తుతం ఓ భారీ పాటను చిత్రీకరిస్తున్నారు. ఏకంగా వెయ్యి మంది డ్యాన్సర్లతో ఈ పాటను ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Ram Charan
Siddaramaiah
Karnataka CM
Peddi Movie
Buchi Babu Sana
Janhvi Kapoor
Shivrajkumar
Mysore
Telugu Cinema
Indian Cinema

More Telugu News