Nara Lokesh: ఇంత చిన్న వయస్సులో అందరినీ వదిలి ఎలా వెళ్లావురా?: నారా లోకేశ్

Nara Lokesh Mourns TDP Leader Vemparala Jithendra Pawan Kumar Death
  • టీడీపీ యువ నేత వేంపరాల జితేంద్ర పవన్ కుమార్ హఠాన్మరణం
  • గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడి
  • పర్చూరు టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడిగా సేవలు
  • మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం
  • 'గొప్ప పసుపు సైనికుడిని కోల్పోయాం' అంటూ ఆవేదన
  • జితేంద్ర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటన
తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. పర్చూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ యువ నేత, నియోజకవర్గ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడు వేంపరాల జితేంద్ర పవన్ కుమార్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జితేంద్రకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ భావోద్వేగభరితమైన ప్రకటన విడుదల చేశారు.

"తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం పెడతావు. టీడీపీ జెండా పట్టుకుని సైనికుడిలా ముందుండి నడిచావు. ఇంత చిన్న వయస్సులో అందరినీ వదిలి ఎలా వెళ్లావురా? పర్చూరు నియోజకవర్గ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడిగా నీ పోరాటం.. పార్టీ నాయకులు చెబుతుంటే ఎంత గొప్ప పసుపు సైనికుడిని కోల్పోయామో అర్థమవుతోంది. we miss you raa వేంపరాల జితేంద్ర పవన్ కుమార్. గుండెపోటుతో మృతి చెందిన నీకు హృదయపూర్వక నివాళులు.‌ నువ్వు లేని విషాదాన్ని మోస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నాను" అంటూ నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. 
Nara Lokesh
Vemparala Jithendra Pawan Kumar
TDP
Telugu Desam Party
Parchur
Andhra Pradesh
Heart Attack
Political News
Telugu Professional Wing

More Telugu News