'పుంజుతోక'... రచయితగా మారిన విజిలెన్స్ డీజీ
- రచనా రంగంలోనూ తనదైన ప్రతిభను కనబర్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి
- పుంజుతోక పేరుతో పుస్తకాన్ని రచించిన కొత్తకోట
- 1994 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి కొత్తకోట
- సమాజంలోని రుగ్మతలు, మానవ సంబంధాల పట్ల స్పందిస్తూ అక్షర రూపం ఇచ్చిన శ్రీనివాసరెడ్డి
తెలంగాణ విజిలెన్స్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచనా రంగంలోనూ తనదైన ప్రతిభను కనబర్చి రచయితగా ప్రశంసలు అందుకుంటున్నారు. 'పుంజుతోక' పేరుతో ఆయన పుస్తకాన్ని రచించారు.
1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి తాను పనిచేసిన ప్రాంతాలలో స్వీయ అనుభవాలు, అక్కడి పరిస్థితులను పుస్తక రూపంలో వెల్లడించారు.
విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచనా రంగంలోనూ తనదైన శైలిలో పదునైన పదాలను ప్రయోగించి సీనియర్ రచయితలను సైతం విస్మయానికి గురి చేశారు.
విధి నిర్వహణలో తనదైన శైలిని, సమాజంలోని రుగ్మతలు, మానవ సంబంధాల పట్ల స్పందిస్తూ అక్షర రూపం ఇచ్చారు. ఆయన రచించిన 'పుంజుతోక' పుస్తకంలో వీర, శాంత, రౌద్ర, అద్భుత, కరుణ, భీభత్స తదితర అంశాలను ప్రస్తావించారు. 'పుంజుతోక'లో 120 అంశాలపై ఆయన కవితలు రచించారు.