Mouli Tanuj: జియో సిమ్‌ రాక ముందు జరిగిన కథ ఇది!

This Is the Story Before the Arrival of the Jio SIM
  • 'లిటిల్‌ హార్ట్స్' ట్రైలర్‌ విడుదల 
  • ట్రైలర్‌లో ఆకట్టుకుంటోన్న వినోదం 
  • సెప్టెంబరు 5న చిత్రం విడుదల
ఈ రోజుల్లో యూత్‌ఫుల్‌ కథకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడిస్తే ఆ చిత్రాలు కుర్రకారును అమితంగా అలరిస్తున్నాయి. ఇక ఆ కంటెంట్‌లో హిలేరియస్‌ కామెడీతో పాటు కాస్త కొతద్తనం ఉంటే బాక్సాఫీస్‌ వద్ద ఆ చిత్రం డిస్టింక్షన్‌లో పాస్‌ అయిపోయినట్లే! ఇప్పుడు ఇదే కోవలో ఈ బాక్సాఫీస్‌ సూత్రాన్ని నమ్ముకుని వస్తున్న చిత్రమే 'లిటిల్‌ హార్ట్స్‌'. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ మూవీకి  నిర్మాతగా వ్యవహరించారు. 

ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబరు 5న ఈచిత్రం ప్రేక్షకుల ముందకు రానుంది. అయితే శనివారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్‌లో యూత్‌ను ఆకట్టుకునే ఫన్‌ డైలాగ్స్‌ పుష్కలంగా ఉన్నాయి. ఈ ట్రైలర్‌... ఇది జియో సిమ్‌ రాక ముందు జరిగిన కథంటూ ప్రారంభమవుతుంది. ఆ తరువాత సైనిక్ పురిలో ఉండే చదువురాని అఖిల్ (మౌళి తనూజ్),  నీ మీద ఖర్చు పెట్టే ప్రతీది బొక్కే నాకు అంటూ నాన్న పాత్రలో రాజీవ్‌ కనకాల కొడుకును చివాట్లు పెట్టడం...  నాన్న తిడుతుంటే తినలేకపోతున్నా అమ్మా, రేపట్నుంచి డాడీ రాకముందే అన్నం పెట్టేయ్ తినేస్తా అని హీరో చెప్పడం. ఇలాంటి సంభాషణలు వినోదాన్ని పంచుతాయి. మీరు కూడా ఈ ట్రైలర్‌ చూసి సినిమా మీద ఓ అంచనాకు వచ్చేయండి..! 



Mouli Tanuj
Little Hearts Movie
Sivani Nagaram
Sai Marthand
90s Middle Class Biopic
Rajeev Kanakala
Telugu Movie Trailer
ETV Win Originals
Bunny Vas
Vamsi Nandipati

More Telugu News