Kiren Rijiju: సభలో అంతరాయం కలిగించడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు

Kiren Rijiju comments on parliament disruptions
  • 'ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ' అనే అంశంపై చర్చ
  • సభలో జరిగే చర్చల్లో పాల్గొనాలని నాయకులపై ఒత్తిడి తేవాలని ఎంపీలకు సూచన
  • సభలో అంతరాయం కలిగిస్తే సభ్యులకే నష్టమన్న కిరణ్ రిజిజు
పార్లమెంటులో తరచూ అంతరాయం కలిగిస్తే ప్రభుత్వానికి నష్టమేమీ ఉండదని, సభ్యులకే నష్టం వాటిల్లుతుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. సభలో జరిగే చర్చల్లో పాల్గొనేలా ఆయా పార్టీల ఎంపీలు తమ నాయకులపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. గొడవలు, అంతరాయాలకు పాల్పడితే చివరకి పార్లమెంటు సభ్యులకే నష్టం వాటిల్లుతుందని అన్నారు. సభకు అంతరాయం కలిగించాలని ఆదేశాలను ఎంపీలు అడ్డుకోవాలని సూచించారు.

'ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ' అనే అంశంపై కర్ణాటక హైకోర్టు న్యాయవాదులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సభలో గందరగోళం సృష్టించడం తప్ప చర్చల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపని నేతలపై ఒత్తిడి తేవాలని అన్నారు. సభలో అంతరాయం కలిగిస్తే ప్రభుత్వానికి నష్టం లేదని, సభ్యులకే నష్టమని ఆయన స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెడుతుందని తెలిపారు.

ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాలపై మాట్లాడుతూ, చర్చల్లో పాల్గొనాలని విపక్ష పార్టీలకు అనేకసార్లు విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. సభా కార్యకలాపాలకు సంబంధించి ప్రతిరోజు ఉదయమే జాబితా సిద్ధమవుతుందని ఆయన అన్నారు. ఏయే అంశాలపై, ఎంతసేపు చర్చించాలనే విషయాలను ముందుగానే నిర్ణయిస్తారని తెలిపారు. కానీ నేతల సూచనల మేరకు ఆయా విపక్ష పార్టీ సభ్యులు సభలో వ్యవహరిస్తారని తెలిపారు.
Kiren Rijiju
Parliament disruptions
Central Minister
Parliamentary system
Monsoon session
Karnataka High Court

More Telugu News