Narendra Modi: ఎస్‌సీవో సదస్సు కోసం చైనాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ
- ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు కోసం చైనాకు ప్రధాని మోదీ
- టియాన్జిన్ నగరానికి చేరుకున్న భారత ప్రధాని
- చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా భేటీ
- రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ చర్చలు జరపనున్న మోదీ
- అమెరికా సుంకాల నేపథ్యంలో పర్యటనకు పెరిగిన ప్రాధాన్యం
అమెరికాతో వాణిజ్య సంబంధాలు కాస్త బెడిసికొట్టిన కీలక తరుణంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన శనివారం చైనాలోని టియాన్జిన్ నగరానికి చేరుకున్నారు. ఏడేళ్ల విరామం తర్వాత చైనాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.
ఇటీవల భారత్‌పై అమెరికా 50 శాతం మేర వాణిజ్య సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గానూ ఇందులో 25 శాతం సుంకాన్ని విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ చైనా పర్యటనకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ప్రపంచ దేశాలన్నీ ఈ పర్యటనను ఆసక్తిగా గమనిస్తున్నాయి.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటన చేపట్టారు. సదస్సు సందర్భంగా ఆయన జీ జిన్‌పింగ్‌తో పాటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ విడిగా సమావేశం కానున్నారు. ఇతర దేశాల నేతలతోనూ ప్రధాని చర్చలు జరిపే అవకాశం ఉంది. జపాన్ పర్యటనను ముగించుకున్న వెంటనే ప్రధాని మోదీ నేరుగా చైనాకు బయల్దేరి వెళ్లారు.