Mahavatar Narasimha: ఓటీటీ సీన్ మార్చేసిన 'మహావతార్ నరసింహా'

Mahavatar Narasimha Movie Update
  • జులై 25న విడుదలైన సినిమా 
  • మౌత్ టాక్ తో దూసుకుపోయిన కంటెంట్ 
  • 300 కోట్ల క్లబ్ లో చేరిన మూవీ 
  • ఓటీటీ రైట్స్ కి విపరీతమైన డిమాండ్ 

ఈ మధ్య కాలంలో 'కూలీ' సినిమాకి ముందు థియేటర్లకి వచ్చిన పెద్ద సినిమాలేం లేవు. అందువలన థియేటర్ల దగ్గర పెద్ద సందడి కనిపించలేదు. అలాంటి సమయంలోనే 'మహావతార్ నరసింహ' సినిమా బరిలోకి దిగడానికి రంగం సిద్ధమైంది. ఇది యానిమేటెడ్ సినిమా. అందువలన అందరూ లైట్ తీసుకున్నారు. మరికొందరేమో చిన్నపిల్లల కోసం తీసినట్టున్నారని అనుకున్నారు. అంతలో థియేటర్లకు ఈ సినిమా రానే వచ్చింది.

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. రిలీజ్ రోజున కూడా ఈ సినిమాను గురించి పట్టించుకున్నవాళ్లు చాలా తక్కువ. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు అద్భుతం అంటూ చెప్పడంతో ఆ తరువాత షోలు ఫుల్ అయ్యాయి .. అవుతూనే వచ్చాయి. భక్త బృందాలు వెళ్లి థియేటర్స్ లో భజనలు చేసే పరిస్థితి వచ్చింది. ఒక భక్తి చిత్రం .. అందునా యానిమేషన్ కంటెంట్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఎవరూ ఊహించలేదు.

ఇలా ఒకసారి మొదలైన మౌత్ పబ్లిసిటీ ఇక ఆగలేదు. 100 కోట్లు .. 200 కోట్లు .. మార్కును దాటుకుని ఇప్పుడు ఈ సినిమా 300 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. దాంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ సంస్థలు సినిమాలు తీసుకువడమనేది అంత తేలికగా జరగడం లేదు. నిర్మాతలు అనేక అవస్థలు .. అగ్నిపరీక్షలు ఎదుర్కుంటున్నారు. అలాంటిది 'మహావతార్ నరసింహ' కోసం ఓటీటీ సంస్థలు పోటీలు పడుతున్నాయి .. హక్కుల కోసం పరుగులు పెడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీ సీన్ మార్చేసిన సినిమా ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 
Mahavatar Narasimha
Mahavatar Narasimha movie
Animated movie
OTT rights
Allu Aravind
Telugu movie
Box office collection
Indian cinema
Mythological movie
Narasimha Swamy

More Telugu News