Sagar The 100: ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్!

The 100 Movie Special
  • జులైలో థియేటర్లకు వచ్చిన 'ది 100'
  • మరోసారి పోలీస్ పాత్రలో కనిపించిన సాగర్
  • ఆయన నటన హైలైట్  
  • ప్రధానమైన బలంగా నిలిచిన ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం
  • టాప్ టెన్ లో నిలిచిన కంటెంట్ 

కొంతమంది హీరోలకు కొన్ని పాత్రలు బాగా సెట్ అవుతాయి. అలాంటి పాత్రలలోనే వాళ్లని చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అందువలన ఆ తరహా పాత్రలోనే ఆ హీరోలు ఆడియన్స్ ముందుకు రావలసిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అందుకు మరో ఉదాహరణగా హీరో 'సాగర్' ను తీసుకోవచ్చు. టీవీ సీరియల్స్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలతో ప్రేక్షకులను ప్రభావితం చేసిన సాగర్, వెండితెరపై కూడా అదే జోష్ ను చూపుతూ చేసిన సినిమానే 'ది 100'. 

మెగా మదర్ మొదలు పవన్ .. నాగబాబు ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడంతో, అందరి దృష్టిని ఈ సినిమా ఆకర్షించింది. జులై 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. విలువలతో కూడిన సినిమాలను నిర్మించడంలో ఉత్సాహాన్ని చూపుతున్న రమేశ్ కరుటూరి .. వెంకీ పూషడపు .. తారక్ రామ్ ఈ సినిమాను నిర్మించారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కథాకథనాల పరంగా, సాగర్ యాక్షన్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం ఈ కథకు బలమైన సపోర్టుగా నిలిచాయి. ఈ నెల 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ - లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా, చాలా వేగంగా టాప్ టెన్ లో నిలిచింది.  

ఐపీఎస్ గా శిక్షణ పూర్తిచేసుకున్న విక్రాంత్, సిటీలో ఛార్జ్ తీసుకుంటాడు. ఒక ముఠాకి సంబంధించిన కేస్ అతనికి సవాలు విసురుతుంది. తాను ఇష్టపడిన 'ఆర్తి' కూడా ఆ ముఠా బారిన పడిందని తెలియడంతో అతను మరింత దూకుడుగా ముందుకు వెళతాడు. అయితే ఆ కేసుకి .. ఆ ముఠాకి సంబంధం లేదని తెలిసి ఆలోచనలో పడతాడు. అసలు నేరస్థులు ఎవరు? వాళ్లు ఆర్తిని ఎందుకు టార్గెట్ చేశారు? ఆ కేసును విక్రాంత్ ఎలా  ఛేదిస్తాడు? అనేది కథ. మిషా నారంగ్ .. ధన్య బాలకృష్ణ .. కల్యాణి నటరాజన్ .. తారక్ పొన్నప్ప కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అనిపిస్తోంది. 


Sagar The 100
The 100 movie
Sagar actor
Telugu movies OTT
Crime thriller Telugu
Amazon Prime Telugu
Lionsgate Play Telugu
Raghav Omkar Shashidhar
Misha Narang
Dhanya Balakrishna

More Telugu News