Sachin Tendulkar: టెండూల్కర్ ఇంట వేడుక.. కాబోయే కోడలితో సచిన్.. ఫొటోలు వైరల్!

Saaniya Chandok Attends Sachin Tendulkars Family Function With Arjun Pictures Go Viral
  • క్రికెట్ దిగ్గజం సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు నిశ్చితార్థం
  • ప్రముఖ వ్యాపారవేత్త మనవరాలు సానియా చాందోక్‌తో ఎంగేజ్‌మెంట్
  • తల్లి పుట్టినరోజు వేడుకల్లో కాబోయే కోడలిని పరిచయం చేసిన సచిన్
  • కుటుంబంతో సానియా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
  • అభిమాని ప్రశ్నకు స్పందించి, ఎంగేజ్‌మెంట్‌ను ధ్రువీకరించిన స‌చిన్‌
భార‌త క్రికెట్ దిగ్గ‌జం సచిన్ టెండూల్కర్ ఇంట్లో సందడి నెలకొంది. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా సచిన్ శుక్రవారం పంచుకున్న ఫ్యామిలీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో సచిన్ కుటుంబంతో పాటు ఆయన కాబోయే కోడలు సానియా చాందోక్ కూడా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోస్ట్ పెట్టిన ఎనిమిది గంటల్లోనే 2.6 లక్షలకు పైగా లైకులు రావడం విశేషం.

ఈ సందర్భంగా తన తల్లిని ఉద్దేశించి సచిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. "నీ గర్భంలో పుట్టాను కాబట్టే నేను ఒకడినయ్యాను. నువ్వు ఆశీర్వదించావు కాబట్టే ఎదుగుతూ వచ్చాను. నువ్వు బలంగా ఉన్నావు కాబట్టే మేమందరం బలంగా నిలబడ్డాం. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా!" అని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకలో సానియా కూడా పాలుపంచుకోవడంతో ఆమె టెండూల్కర్ కుటుంబంలో పూర్తిగా కలిసిపోయినట్లు స్పష్టమవుతోంది.

నిజానికి సచిన్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్‌కు ఈ నెల ఆరంభంలోనే సానియా చాందోక్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే, ఈ విషయాన్ని ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించలేదు. ఈ నెల‌ 25న సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన సచిన్‌ను ఓ అభిమాని "అర్జున్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జరిగిందా?" అని ప్రశ్నించారు. దీనికి సచిన్ స్పందిస్తూ, "అవును, అతనికి నిశ్చితార్థం జరిగింది. అతని జీవితంలో మొదలైన ఈ కొత్త దశ పట్ల మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం" అని బదులిచ్చారు.

సానియా చాందోక్ ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు. హాస్పిటాలిటీ, ఫుడ్ ఇండస్ట్రీలో ఘాయ్ కుటుంబానికి మంచి పేరుంది. ప్రముఖ ఇంటర్‌కాంటినెంటల్ హోటల్‌తో పాటు బ్రూక్లిన్ క్రీమరీ కూడా వీరివే. ఇక అర్జున్ టెండూల్కర్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా, బ్యాటర్‌గా దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరఫున ఆడుతున్నాడు.
Sachin Tendulkar
Arjun Tendulkar
Sania Chandok
Tendulkar family
Indian cricketer
engagement photos
Mumbai Indians
cricket news
Tendulkar mother birthday
Ravi Ghai

More Telugu News