Allu Aravind: అల్లు కుటుంబంలో విషాదం.. నిర్మాత అల్లు అరవింద్‌కు మాతృవియోగం

Allu Aravind Mother Allu Kanakarathnamma Passes Away
  • అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ కన్నుమూత
  • గ‌త కొంత‌కాలంగా ఆమెకు వృద్ధాప్య సమస్యలు
  • ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు
  • హైదరాబాద్‌కు చేరుకుంటున్న బన్నీ, రాంచరణ్
టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, అల్లు రామ‌లింగ‌య్య స‌తీమ‌ణి అల్లు కనకరత్నమ్మ (94) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 1:45 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈరోజు ఉదయం 9 గంటలకు ఆమె పార్థివదేహాన్ని అల్లు అరవింద్ నివాసానికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ల నిమిత్తం వేర్వేరు నగరాల్లో ఉన్న కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముంబై నుంచి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైసూర్ నుంచి మధ్యాహ్నానికి నగరానికి చేరుకోనున్నారు.

ప్రస్తుతం అల్లు అరవింద్‌, మెగాస్టార్ చిరంజీవి అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, పవన్ కల్యాణ్, నాగబాబు వైజాగ్‌లో ఒక బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉన్నందున, వారు ఆదివారం హైదరాబాద్‌కు వచ్చి అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు తెలిసింది.

అల్లు కనకరత్నమ్మ మర‌ణ‌వార్త తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు, అల్లు అరవింద్ సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నారు. అల్లు కుటుంబానికి సంతాపం తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు.
Allu Aravind
Allu Kanakarathnamma
Allu Ramalingaiah
Geetha Arts
Telugu cinema
Tollywood
Allu Arjun
Ram Charan
Chiranjeevi
Hyderabad

More Telugu News