ముందు నేను మాట్లాడతా... వద్దు రాము, చివరి అవకాశం నీదే!: లోకేశ్-రామ్మోహన్ సరదా సంభాషణ

  • ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో సంఘటన
  • పదవులను పక్కనపెట్టి ఆత్మీయత చాటుకున్న లోకేశ్, రామ్మోహన్ నాయుడు
  • లోకేశ్ మాట్లాడుతుండగా నేను మాట్లాడుతానంటూ లేచిన రామ్మోహన్ నాయుడు
తెలుగుదేశం పార్టీ కోటి మంది సభ్యులు గల అతిపెద్ద కుటుంబం. ఎవరు ఏ స్థాయి పదవుల్లో ఉన్నా అధినేతలను కుటుంబ పెద్దల్లా గౌరవించడం సాంప్రదాయంగా వస్తోంది. విశాఖ నోవాటెల్‌లో జరిగిన ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో పదవులను పక్కనబెట్టి ఆత్మీయతను చాటుకున్నారు నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు.

ప్రోటోకాల్ ప్రకారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సదస్సులో చివరిగా మాట్లాడాల్సి ఉండగా, అంతకుముందుగా మంత్రి లోకేశ్ ప్రసంగించడానికి ఉపక్రమించారు. 'అన్నా ముందు నేను మాట్లాడతాను' అంటూ రామ్మోహన్ నాయుడు తమస్థానం నుంచి పైకి లేచారు.

వెంటనే లోకేశ్ వారిస్తూ, 'వద్దు రాము... ప్రోటోకాల్ ప్రకారం కేంద్రమంత్రి స్థానంలో ఉన్న నువ్వు చివరగా మాట్లాడాలి, ఇప్పుడు నేనే మాట్లాడతాను' అంటూ లోకేశ్ ఉపన్యాసాన్ని ప్రారంభించారు. పదవులను పక్కనబెట్టి అన్నదమ్ముల్లా వారిద్దరి మధ్య సాగిన ఈ సరదా సంభాషణ సభకు విచ్చేసిన ప్రముఖులను అలరించింది.


More Telugu News