హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- అమీర్‌పేట, బంజారాహిల్స్, మణికొండ, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం
- విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు
- ఫ్లైఓవర్ల కింద, బస్‌స్టాప్‌ల వద్ద తలదాచుకున్న ప్రయాణికులు
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, బంజారాహిల్స్, మణికొండ, పంజాగుట్ట, సికింద్రాబాద్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. కార్యాలయాల్లో విధులు ముగించుకుని సాయంత్రం ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు ఫ్లైఓవర్ల కింద, బస్‌స్టాప్‌ల వద్ద తలదాచుకున్నారు.
ప్రాజెక్టులకు జలకళ
తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జోరువానలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 4,30,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, 39 ప్రధాన గేట్ల ద్వారా 5,04,455 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 38 గేట్లు తెరిచి 6,79,019 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.