Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి సోదరులకు నిరాశ.. ముందస్తు బెయిల్ కు హైకోర్టు నిరాకరణ

Pinnelli Ramakrishna Reddy Anticipatory Bail Rejected by High Court
  • టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితులు
  • ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కోసం కోర్టులో పిటిషన్
  • ఈ రోజు విచారణ జరిపి పిన్నెల్లి సోదరుల పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు
టీడీపీ నేతల జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి సోదరులకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్ ను ఈ రోజు తోసిపుచ్చింది. పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం సృష్టించిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6గా, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని ఏ7గా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరుల పాత్ర ఉందనేందుకు తగిన ఆధారాలున్నాయని పోలీసుల తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఈ నెల 21న వాదనలు వినిపించారు.

ఈ కేసులో వాస్తవాలను వెలికితీయాలంటే పిన్నెల్లి సోదరులను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. రాజకీయంగా, ఆర్థికంగా బలవంతులైన పిన్నెల్లి సోదరులకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. పిన్నెల్లి సోదరుల పిటిషన్ ను కొట్టివేసింది.
Pinnelli Ramakrishna Reddy
AP High Court
TDP leaders murder case
Macharla
Palnadu district
Javishetti Venkateswarlu
Javishetti Koteswara Rao
Anticipatory bail rejection

More Telugu News