Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు సెలవుల జాతర.. ఏకంగా 14 రోజుల బంద్!

Bank Holidays in September Banks Closed for 14 Days
  • సగం రోజులే పనిచేయనున్న బ్యాంకులు
  • తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 5న మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సెలవు
  • ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఉండదంటున్న బ్యాంకులు
  • కస్టమర్లు ముందుగానే పనులు ప్లాన్ చేసుకోవాలని సూచన
బ్యాంకు పనుల కోసం తరచూ బ్రాంచీలకు వెళ్లేవారికి ఇది ముఖ్య గమనిక. సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. పండుగలు, వారాంతాలతో కలిపి మొత్తం 14 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌లో వెల్లడించింది. అయితే, ఈ సెలవులన్నీ అన్ని రాష్ట్రాలకు వర్తించవని కస్టమర్లు గమనించాలి.

సెప్టెంబర్ నెలలో పండుగలు, ఇతర ప్రత్యేక రోజుల కారణంగా మొత్తం 9 రోజులను ఆర్బీఐ సెలవులుగా ప్రకటించింది. వీటికి అదనంగా ఐదు వారాంతపు సెలవులు (ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు) ఉన్నాయి. దీంతో మొత్తం సెలవుల సంఖ్య 14కు చేరింది. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, కేరళలో ఓనం పండుగకు ఇచ్చే సెలవు ఇతర రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. కాబట్టి, బ్యాంకులకు వెళ్లే ముందు మీ ప్రాంతంలోని సెలవుల జాబితాను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 5న (శుక్రవారం) మిలాద్-ఉన్-నబీ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కర్మ పూజ (జార్ఖండ్), ఇంద్రజాత్ర (సిక్కిం), నవరాత్రి స్థాపన (రాజస్థాన్), దుర్గా పూజ (బెంగాల్, అసోం, త్రిపుర) వంటి పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

వారాంతపు సెలవులు ఇవే
సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారాలు.
సెప్టెంబర్ 13 (రెండో శనివారం), సెప్టెంబర్ 27 (నాలుగో శనివారం).

బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. నగదు లావాదేవీలు లేదా బ్రాంచీకి తప్పనిసరిగా వెళ్లాల్సిన పనులు ఉంటే, ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్లాన్ చేసుకోవడం ద్వారా అనవసరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చు.
Bank Holidays
September Bank Holidays
RBI
Reserve Bank of India
Indian Banks
Bank Holidays List
Festival Holidays
Milad un Nabi
Online Banking

More Telugu News