Ramakrishna: హోం గార్డుల స్వరాష్ట్రాల బదిలీ సమస్యను పరిష్కరించండి.. ఏపీ సీఎంకు సీపీఐ రామకృష్ణ వినతి

CPI Ramakrishna Appeals to AP CM on Home Guards Transfer Issue
  • తెలంగాణలో ఏపీ స్థానికత, ఏపీలో తెలంగాణ స్థానికత కలిగిన హోం గార్డులు పనిచేస్తున్నారన్న సీపీఐ రామకృష్ణ
  • స్వరాష్ట్రాలకు బదిలీ కాకపోవడంతో చాలా అవకాశాలు కొల్పోతున్నారని వినతి
  • రైతులకు యూరియాతో పాటు ఎరువులను అందుబాటులో ఉంచాన్న రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిన్న సచివాలయంలో కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డులుగా నియామకం పొందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ స్థానికత, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ స్థానికత కలిగిన హోంగార్డులు పనిచేస్తున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. వీరు ఇంకా వారి వారి స్వరాష్ట్రాలకు బదిలీ కాకపోవడంతో చాలా అవకాశాలు కోల్పోతున్నారని రామకృష్ణ చెప్పారు. కానిస్టేబుల్స్ సెలెక్షన్స్ విషయంలో వీరికి రెండు రాష్ట్రాల్లోనూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.

వీరిని వారి స్వరాష్ట్రాలకు బదిలీ చేయించేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రిని రామకృష్ణ కోరారు. అలాగే, రాష్ట్రంలో యూరియాతో పాటు రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. 
Ramakrishna
CPI Ramakrishna
Andhra Pradesh
AP CM
Home Guards
Telangana
Home Guards Transfer
AP News
Chandrababu Naidu
Fertilizers

More Telugu News