AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు... ఒకరికి ఊరట... ఇద్దరికి నిరాశ

AP Liquor Scam One Granted Bail Two Denied
  • ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు వేసిన దిలీప్, కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్
  • పైలా దిలాప్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
  • కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ కు నిరాశ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు ఈరోజు మిశ్రమ తీర్పు వెలువరించింది. ఒక నిందితుడికి ఊరట కల్పిస్తూ బెయిల్ మంజూరు చేయగా, మరో ఇద్దరి అభ్యర్థనలను తోసిపుచ్చింది.

వివరాల్లోకి వెళితే, గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పైలా దిలీప్, రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం, రాజ్ కేసిరెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా (పీఏ) పనిచేసిన పైలా దిలీప్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

అయితే, ఇదే కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను మాత్రం న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో వారు మరికొంత కాలం జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఈ తీర్పుతో ఒకరికి ఉపశమనం లభించగా, మిగిలిన ఇద్దరికీ నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా, కోర్టు తాజా ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 
AP Liquor Scam
Pyla Dileep
Raj Kesireddy
Sajjala Sridhar
Vijayawada ACB Court
Liquor Case Bail
Andhra Pradesh Liquor Scam
Jagan Government
Liquor Investigation

More Telugu News