భారీ వర్షాలు, వరదలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే

  • వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు విహంగ వీక్షణం
  • ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి
  • వరద ప్రవాహాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి స్వయంగా విహంగ వీక్షణం ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఏరియల్ సర్వే అనంతరం ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి, వరద ప్రవాహాన్ని పరిశీలించారు.

భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయం నుంచి వేగంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 37 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటిమట్టం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.


More Telugu News