Poorna: సినీనటి పూర్ణ భర్త ఎమోషనల్ పోస్ట్... నెటిజన్ల కామెంట్లు!

Poornas Husband Clarifies Emotional Post Amidst Divorce Speculation
  • భార్యకు 45 రోజులు దూరంగా ఉన్నానంటూ పూర్ణ భర్త ఎమోషనల్ పోస్ట్
  • ఒంటరితనాన్ని భరించలేకపోయానని, కన్నీళ్లు వచ్చాయని ఆవేదన
  • సోషల్ మీడియాలో విడాకులంటూ పెద్ద ఎత్తున ప్రచారం
  • పుకార్లపై వెంటనే స్పందించిన భర్త అసిఫ్ అలీ
  • తామిద్దరం సంతోషంగానే ఉన్నామని పుకార్లకు ఫుల్‌స్టాప్
ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న నటి పూర్ణ వైవాహిక జీవితంపై సోషల్ మీడియాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆమె భర్త, దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్.. వారిద్దరూ విడిపోతున్నారనే పుకార్లకు దారితీసింది. ఈ వార్తలు వైరల్ అవ్వడంతో, అసలేం జరిగిందనే దానిపై ఆయన స్వయంగా స్పష్టత నిచ్చారు.

వివరాల్లోకి వెళితే, పూర్ణ భర్త షానిద్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన భార్య 45 రోజులుగా దూరంగా ఉందని, ఆ ఒంటరితనాన్ని, నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

"నా జీవితంలో ఈ 45 రోజులను నేనెప్పటికీ మర్చిపోలేను. నీ జ్ఞాపకాలతోనే రాత్రులు గడపాల్సి వచ్చింది. ప్రతి ఉదయం నిన్ను తలచుకుని ఏడ్చేవాడిని. మనల్ని ప్రేమించే వారు మనతో ఉండటమే జీవితంలో అన్నిటి కంటే గొప్ప వరం. ఈ 45 రోజుల్లో నాకు నీ ప్రేమ గొప్పతనం తెలిసి వచ్చింది" అని ఆయన రాసుకొచ్చారు. ఎట్టకేలకు తన భార్య తన వద్దకు వచ్చేసిందని ఆనందం వ్యక్తం చేశారు.

అయితే, ఈ పోస్ట్‌లోని ఆవేదనను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఈ వార్తలు వ్యాపించడంతో, షానిద్ అసిఫ్ అలీ వెంటనే మరో పోస్ట్‌తో స్పందించారు. "నా భార్య 45 రోజులు నాకు దూరంగా ఉంది. పెళ్లి జరిగిన తర్వాత ఎప్పుడూ కూడా ఇన్ని రోజులు దూరంగా ఉండలేదు. అందుకే అలా పోస్ట్ పెట్టాను. దయచేసి మీరు తప్పుడుగా అర్థం చేసుకొని ఉన్నవిలేనివి కలిపి రాయొద్దు. దేవుడి దయతో మేమంతా సంతోషంగానే ఉన్నాము," అని ఆయన పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు.

‘సీమటపాకాయ్’, ‘అఖండ’, ‘దసరా’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన పూర్ణ, 2022లో షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్నారు. వీరికి 2023లో ఒక బాబు జన్మించాడు. ప్రస్తుతం ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భర్త పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 
Poorna
Poorna actress
Shanid Asif Ali
Poorna husband
Telugu actress
Akhanda movie
Dasara movie
celebrity divorce rumors
Dubai businessman
actress Poorna family

More Telugu News