Minneapolis School Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు చిన్నారుల మృతి

Minneapolis School Shooting Leaves Two Children Dead
  • మిన్నెసోటా మినియాపొలిస్‌లో ఓ క్యాథలిక్ పాఠశాలలో ఘటన
  • విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో కాల్పులు
  • ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేసిన మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. పాఠశాలలో విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. మిన్నెసోటాలోని మినియాపొలిస్‌లో ఓ క్యాథలిక్ పాఠశాలలో విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో పలు ఆయుధాలతో అక్కడికి వచ్చిన నిందితుడు కిటికీల ద్వారా పిల్లలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 14 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై మినియాపొలిస్ పోలీస్ చీఫ్ బ్రియాన్ ఓహారా మాట్లాడుతూ ఆయుధాలతో వచ్చిన నిందితుడు పిల్లలపై కాల్పులకు తెగబడ్డాడని చెప్పారు. ఈ ఘటనలో నిందితుడు కూడా మరణించాడని, అతని వయసు 20 ఏళ్ల లోపు ఉంటుందని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
Minneapolis School Shooting
Minneapolis
School Shooting
Minnesota
Tim Walz
Brian Ohara
US School Shooting
America School Shooting
Gun Violence

More Telugu News